6:28 AM

ఇదం రాజకీయం!!

హ్హ.. హ్హ.. రాజకీయానికి క్వాలిఫికేషన్లా...! ఇదెప్పన్నుండి.. గోచీ పెట్టుకోవడం రాకున్నా, టోపీ పెట్టడం వస్తే రాజకీయంలో రాణించేస్తారు కదయ్యా...

ఛ! ఊరుకోండి సార్.. ఎవరైన వింటే నవ్విపోతారు.. మీరు ఇంకా ఏకాలంలో ఉన్నారు.. ఇది గవర్నమెంటు హాస్పిటల్ లో ఉడకపెట్టిన గుడ్లు స్కాం చేసే కాలంకాదు సార్! కాలం మారిపోయింది.. హైటెక్ స్కాం లు చేయగలిగిన చేతి సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండాలి..

అంటే! కిడ్నీలు, బ్లడ్, కళ్ళు, కడుపులో అండాలు కొట్టే పరిజ్ఞానం కావాలంటావా ఏంటి?

ఛ! ఊరుకోండి సార్! ఇంకా కిడ్నీలలో రాళ్ళేరుకునే కాలంలోనే ఉన్నారు మీరు.. హైటెక్ స్కాం లు సార్.. హైటెక్ స్కాం లు..

పరిజ్ఞానం అంటావు... స్కాంలు అంటావు.. కూసింత అర్థం అయ్యేలా చెప్పు..

మీకు తెలియనిదేముంది సార్! బ్యాంకు స్కాంలు, సాఫ్ట్ వేరు స్కాంలు, భూమి స్కాంలు, ఫైనాన్స్ కంపెనీ స్కాంలు, రైల్వే స్కాంలు, ఇండస్ట్ర్రియల్ స్కాంలు.. టెర్రరిస్టు స్కాం లు....... ...

ఆగాగు..! మిగిలినవన్నీ మేం చేయనివి కాదు కాని! ఈ టెర్రరిస్టు స్కాం ఏంది?

ఏముంది సార్! టెర్రరిస్టుల అటాక్ లో చచ్చిపోయిన వాళ్ళ సంఖ్యను నాలుగు రెట్లు రికార్డులలో చూపించి, చనిపోయిన వాళ్ళకు ఒక్కొక్కరి పేరు మీద ఒక ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం అని చెప్పి, ఎవరికి ఇవ్వకపోతే సరి.. ఇలా చేస్తే టివి చానళ్ళు ఊరుకుంటాయా అంటారేమో! బాంబ్ అటాక్ జరిగిన రెండ్రోజులు నాన్ స్టాప్ డెత్ కౌంటింగ్ పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు టెర్రరిస్టులు అటాక్ చేస్తారా! అన్నట్టు వేచి ఉంటాయి.. వాళ్ళు కూడా మనలాగే కాని.. కొంచెం తేడా అంతే! వాళ్ళూ ఆడ్స్ తో కొడితే, మనం కడుపుల మీద కొడతాం! అదే తేడా!

ఒక వేళ టెర్రరిస్టు అటాక్స్ జరగకపోతే? అప్పటి సంగతేంటోయ్!

దానిదేముంది సార్. మీలాంటి పనికిమాలిన నాయకులుంటే అటాక్ లు జరగకుండా ఎలా పోతాయ్?? ఒక వేళ తెర్రరిస్టుల బుద్ది వక్రించి అటాక్ లు చేయకపోతే.. మనమే బాంబులు వేయిద్దాం!! ..........


ఆ..............................

12:34 PM

కుంటెద్దుకు పగ్గాలా?!

సాక్షి పత్రికను చూస్తే అది పక్కా రాజకీయ రంగుల పత్రిక అని అనిపించకపోదు.. దానికి సాక్షి మెయిన్ పేజ్ ఏ సాక్షి.. ఇకపోతే ఓన్లీ పార్టీని సపోర్టు చేస్తూ మొత్తం పేపరు పేడితే జనాలు "అది జనాలను బకరాలను చేయడానికి పెట్టిన పత్రిక" అని ఎక్కడ అనుకుంటారో అని మడతపేజీల్లో నాలుగు మామూలు పేజీలు జోడిచారు. . అంతా బాగానే ఉంది.. పార్టీ పచ్చగా ఉంది కాబట్టి పేపర్ రంగు రంగులతో లేగదూడకు రంగులు రుద్దినట్టు ఉంది.. ఒక వేళ టైం బాలేక ప్రతి పక్షాల కూటమి బలపడి ప్రస్తుత సీ. ఎం. సీట్ కు కన్నం పడితే... సాక్షి పేపరుకు బొక్క పడుతుందా అనేది నా సందేహం..

సాక్షి పేపర్ వచ్చిన నాటి నుండి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క పార్టీని సపోర్టు చేస్తూ అమ్మ నా బూతులు తిట్టుకుంటున్నారు.. రాళ్ళు విసురుకోవడమ్ లాంటి రాక్షస చర్యలు కూడా జరిగిపోయాయి.. దీనికి తోడు లైవ్ టి.వి చానళ్ళు ఎదురెదురుగా వేర్వేరు పార్టీల కూర్చొపెట్టి, అసలే ఎప్పుడు ఎదురు పడితే కొట్టుకుందామా అని కాసుక్కూర్చునే వాళ్ళకు అవకాశమ్ ఇచ్చి.. వాళ్ళు తిట్టుకుంటుంటే దాన్ని మధ్య మధ్యలో బ్రేక్ లిస్తూ మరీ టెలికాస్ట్ చేస్తున్నారు..ఇలాంటి తరుణం లో వై ఎస్ కు బొక్క పడితే సాక్షి పేపర్ కుంటెద్దుకు పగ్గాలేసినట్టు అవుతుందా? లేదా జగన్ పెన్ లో గన్ ను పెట్టి... అక్షరాలను తూటాల్లా ఆయా పార్టీల మీదకు సంధిస్తాడా... అనేది వేచి చూడాలి..

అంతా సాక్షి మయం...!!